School Radio Clubs
School Radio@Siricilla!

Bharti Foundation supports School Radio Clubs

School Radio Clubs were initiated in Rajanna Sircilla District with the support of Bharti Foundation

School Radio Clubs were initiated in Rajanna Sircilla District, Telangana with the support of Bharti Foundation. Bharti Foundation, the philanthropic arm of Bharti Enterprises was established in 2000 with a vision "To help underprivileged children and young people of our country realize their potential". All educational programs initiated by Bharti Foundation entail close partnerships with the government, policy makers, corporations, local communities and the general public. These programs aim at holistic development of children making them employable citizens with a deep sense of commitment to society. The intent is to develop a scalable and sustainable education model that can be replicated on a large scale by the government, educational institutions and like-minded organizations.

School Radio workshop was organized at ZP High School (Girls), Sircilla from 24 to 26 September 2018 and the students from the following schools have participated.

ZP High School, Nehru Nagar
ZP High School, Vemkampet
KR ZP High School (Boys), Shiva Nagar
ZP High School, Ambedkar Nagar
ZP High School (Girls), Sircilla

Feedback

స్కూల్‌ రేడియో వర్క్‌ షాప్‌ అనేది చాలా మంచి ప్రోగ్రాం. నాకు ఫస్ట్‌ డే వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఎలా ఉంటుందో, ఎలా చెప్తారో, ఎవరెవరు వస్తారో, ఎంతమంది వస్తారో, ఏం అంటారో అని చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చాక స్కూల్‌ రేడియో టీమ్‌ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా హాపీగా అనిపించింది. స్కూల్‌ రేడియో గురించి చెప్తుంటే చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. నేను స్టోరీ రైటింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. రెండవ రోజుకి మాలో కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. ఒక థీమ్‌ సెలెక్ట్‌ చేసుకుని దాని మీద స్క్రిప్ట్‌ రాయమన్నారు. మా గ్రూపులో అందరం డిస్కస్‌ చేసుకున్నాం. తర్వాత స్క్రిప్ట్‌ రాసాము. రికార్డింగ్‌కి ప్రిపేర్‌ అయ్యాం. మూడవ రోజు రికార్డింగ్‌ అయింది. తర్వాత వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ మీద డిస్కస్‌ చేశాం.
డి.అఖిల, 8వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
మేము ఎన్విరాన్‌మెంట్‌ థీమ్‌తో రేడియో ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాం. నేను రేడియోలో చాలా చక్కగా మాట్లాడాను. నా కాన్ఫిడెన్స్‌ ఇంకా పెరిగింది. నా భయం కూడ పోయింది. నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నా నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ చేసుకున్నాను. మేము అందరం కలిసి టీమ్‌ వర్క్‌ చేశాం.
జావెరియా, 7వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌ స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
రికార్డింగ్‌ రూమ్‌లో ఏ చప్పుడు లేకుండా జాగ్రత్తగా రికార్డు చేయాలని నేర్చుకున్నాను. నేను చెట్లు గురించి చెప్పాను.
జి. వర్ష, 6వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో మొదటి రోజు కొన్ని యాక్టివిటీలు ఇచ్చారు. అవి చాలా లాజికల్‌గా ఉన్నాయి. కొన్ని కార్డులు ఇచ్చి, వాటిలో బొమ్మల ఆధారంగా కథ రాయమని చెప్పారు. మా గ్రూపు అంతా కలిసి క్రియేటివ్‌ స్టోరీ రాశాం. మూడవ రోజు మేము రాసిన వాటితో రికార్డింగ్‌ జరిగింది. మేము ఒక థీమ్‌ తీసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్క్రిప్ట్‌ రాసుకున్నాం. ప్రోగ్రామ్‌ షీటు, యాంకర్‌ స్క్రిప్ట్‌ తయారు చేసుకున్నాం. తర్వాత రికార్డింగ్‌ చేశాం. రికార్డింగ్‌ నాకు చాలా బాగా నచ్చింది.
ఎ.హేమ, 8వ తరగతి
జెడ్‌పిహెచ్‌ స్కూలు, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
మా టీం స్వచ్ఛ భారత్‌ అనే టాపిక్‌ తీసుకున్నాం. అందులో నేను స్పీచ్‌ చెప్పాను. చాలా బాగా అనిపించింది. ఇది ఇంకా రెండు రోజులు ఉంటే చాలా బాగా ఉండు అనిపించింది.
పి.కీర్తి, 7 వ తరగతి
జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
వర్క్‌షాప్‌ రెండవ రోజు రాగానే నేను అసలు భయం లేకుండా అడిగిన దానికి సమాధానం ఇచ్చాను. చాలా చక్కగా అడిగినవన్నీ రాసి చూపెట్టాను. ఇక మూడవ రోజు నేను యాంకర్‌గా చేసాను. ఇప్పుడు అసలు భయం లేదు.
ఎస్‌. రక్షిత, 9వ తరగతి
జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
స్క్రిప్ట్‌ రైటింగ్‌, స్టోరీ రైటింగ్‌, లిజనింగ్‌ స్కిల్స్‌, రైటింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. మూడవ రోజున మేము రాసిన కథలు, పాటలు, సంభాషణలు రికార్డు చేసుకున్నాము.
జె.శరణ్య, 8వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌ స్కూల్‌, శివానగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో వలన నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. యాంకరింగ్‌ ఎలా చేయాలో తెలుసుకున్నాను. యాంకరింగ్‌ చేశాను.
పి.శృతి, 8వ తరగతి
జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో ప్రోగ్రాంలో చాలా ఉత్సాహంగా నేను పాల్గొన్నాను. నేను ముందుగా ఉదయ్‌ సర్‌కి, అరుణ మేడమ్‌కి కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే వారు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. క్రియేటివ్‌ రైటింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను.
జి.మహేందర్‌, 8వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
నాకు స్కూల్‌ రేడియో ప్రోగ్రాం చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రాంలో చాలా సంతోషంగా పాల్గొన్నాను. మొదటి రోజు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లిజనింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. రెండవ రోజు నేను ఒక అంశంపై సృజనాత్మకంగా ఒక కథను రూపొందించాను. ఇదే కాకుండా ఒక బొమ్మను చూసి ఒక కథను రూపొందించాను. నలుగురిలో ధైర్యంగా ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఈ మూడు రోజుల్లో జరిగిన విషయాలను అందరితో పంచుకున్నాను.
డి. మినారి, 9వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
ఒక థీమ్‌ ఆధారంగా సృజనాత్మకంగా స్కూల్‌ రేడియో కోసం నేను ఒక పాటను రాసి, పాడాను.
పడకంటి స్రావిక గుప్త, 9వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
మొదటి రోజు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు కావచ్చు అని భయం వేసింది. కాని ఇక్కడకు వచ్చాక ఆ భయం తొలగిపోయింది. మా గ్రూపు వాళ్ళం కలిసి ఒక కథ రాశాం. ''మీరు భయపడకూడదు. భయపడితే ముందుకు వెళ్ళరు. మేము ఇక్కడ మీకు ఎటువంటి మార్కులు వేయం. మీ మనస్సుకు నచ్చింది చేయండి'' అని ఇక్కడ చెప్పారు. అప్పుడు మా అందరికీ కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఒక డిఫరెంట్‌ పిక్చర్‌ ఇచ్చి దాని గురించి కథ రాయమన్నారు. అందరం రాశాము.
ఆర్‌ .చందన, జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా  

నేను ఈ మూడు రోజుల్లో చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడికి రావటానికి చాలా భయపడ్డాను. ఇక్కడ అడిగిన ప్రశ్నలకు నేను సరిగ్గా జవాబు చెప్పలేకపోయాను. కాని నాకు తర్వాత ధైర్యం వచ్చింది. స్క్రిప్ట్‌ రైటింగ్‌, రీసెర్చ్‌ స్కిల్స్‌, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇలా ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను. ఈ స్కూల్‌ రేడియో ప్రోగ్రాం నాలో మార్పును తీసుకువచ్చింది.
ఎ. ఓం, 9వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
ఇక్కడికి భయపడుతూ వచ్చాను. అందరిముందూ మాట్లాడటానికి భయపడ్డాను. కొన్ని ఫోటోలు ఇచ్చి ఆన్సర్‌ చేయమన్నారు. చాలా బాగా అనిపించింది. కొన్నింటికి ఆన్సర్‌ చేయలేకపోయినా, రెండవ రోజు కొంచెం భయం పోయింది. ఒక కార్డు ఇచ్చి కథ వ్రాయమన్నారు. ఇది బాగా అనిపించింది. మూడవ రోజు ఇక ఏ భయం లేదు. చక్కగా రేడియో రికార్డు చేశాను.
జి.పవన్‌, 7వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో వర్క్‌ షాప్‌లో మేము ఎన్విరాన్‌మెంట్‌ థీమ్‌ సెలక్ట్‌ చేసుకున్నాము. ప్రకృతి గురించి, చెట్ల గురించి కవిత, పద్యం, పాటలతో స్క్రిప్ట్‌ రాసుకున్నాం. మాలో యాంకర్‌ ఎవరో నిర్ణయించుకున్నాం. యాంకర్‌ స్క్రిప్ట్‌, ప్రోగ్రామ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాం. తర్వాత రికార్డింగ్‌ చేశాం. మాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఎ. వైష్ణవి, కె. అక్షిత
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ నాతో స్నేహంగా ఉన్నారు. మాకు ఇచ్చిన 'మై స్టోరీ కార్డు'ను చూసి ఒక కథ రాశాం.
ఎం.మహాలక్ష్మి, 6వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌ (గర్ల్స్‌), సిరిసిల్లా
**
మేము స్క్రిప్ట్‌ రాసుకుని, ప్రాక్టీసు చేసి, స్కూల్‌ రేడియో కోసం రికార్డు చేశాం. స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌తో ఆర్డినరీ స్టూడెంట్స్‌ కూడ ఎక్‌స్ట్రార్డనరీ స్టూడెంట్స్‌ గా మారిపోయారు.
ఆస్మియా, 9వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌ (గర్ల్స్‌), సిరిసిల్లా
**
చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. మేము ఆన్సర్‌ చేసినవి మాకు కరెక్ట్‌ అనిపించింది. కాని వాటిలో చాలా లాజికల్‌ ఆన్సర్స్‌ ఉన్నాయి. మంచి మంచి యాక్టివిటీలు ఇస్తున్నారు. ఆన్సర్స్‌ రాకపోతే మాకు అర్థం అయ్యేలా చెప్తున్నారు. ఇది ఇంకొన్ని రోజులు ఉంటే ఉంటే బాగుండును కానీ, మా క్లాసెస్‌ మిస్‌ అవుతున్నాయని దీనిని మూడు రోజులు మాత్రమే పెట్టారు. అందరం కలిసి గ్రూపు వర్క్‌ చేశాం.
బి.శ్రీలక్ష్మి, 6వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, సిరిసిల్లా
**
నాకు ఈ మూడు రోజులు చాలా ఆనందంగా అనిపించింది. ఈ స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్‌లో నేను రైటింగ్‌ స్కిల్స్‌, యాక్షన్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌ నేర్చుకున్నాను. యాంకరింగ్‌ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇలాంటి ప్రోగ్రాం నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌ నిర్వహించిన భార్తి ఫౌండేషన్‌, స్కూల్‌ రేడియో వారికి నా కృతజ్ఞతలు.
వి.మనిషా, 8వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, వెంకంపేట, సిరిసిల్లా
**
నేను ఈ మూడు రోజుల్లో చాలా నేర్చుకున్నాను. కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలుసుకున్నాను. అంటే ఒక టీమ్‌లో ఒక విషయం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించారు. సార్‌ చెప్పిన తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా అందరం ఆ విషయం గురించి ఏకాభిప్రాయానికి వచ్చాం. దీని ద్వారా అందరం ఐకమత్యంగా ఉండాలని అర్థమయింది.
డి.చరణ్‌, 9వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌ (బాయ్స్‌), సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో మేము చాలా బాగా నేర్చుకున్నాము. నాకు చాలా బాగా అనిపించింది. వీడియోలు చూపుతూ, రకరకాల కార్డులు ఇస్తూ మాతో యాక్టివిటీలు చేయించారు. మాతో కథ రాయించారు. రెండో రోజు ఆ కథను అందరికి వినిపించాము. మూడవ రోజు రికార్డింగ్‌ చేశారు. ఆ రికార్డు మాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మా అందరినీ ఫీడ్‌బ్యాక్‌ రాయమన్నారు. ఈ మూడు రోజులు మాకు చాలా సంతోషంగా అనిపించింది.
కె.మధుకర్‌, 8వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
నేను చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నాకు ఈ ప్రోగ్రాం చాలా నచ్చింది. నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ ప్రోగ్రాంలో మాతో టీచర్స్‌ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. రికార్డింగ్‌ చేయడం చాలా కష్టం కాని అది మేము ఎలాగోఅలాగ చేసేశాం. మొదటి రోజు నేను చాలా భయపడ్డాను. రెండో రోజు నాకు భయం పోయింది. నేను సొంతంగా రాయడం, వినడం, చదవడం నేర్చుకున్నాను.
ఎస్‌. లోకేశ్‌, 8వ తరగతి, సిరిసిల్లా
**
నేను ఈ మూడు రోజులు చాలా ఆనందంగా గడిపాను. మొదటి రోజు కొన్ని వీడియోలు చూపించి మా సమాధానాలు చెప్పమన్నారు. రెండో రోజు నేను స్క్రిప్ట్‌ రైటింగ్‌, లిజనింగ్‌ స్కిల్స్‌ నేర్చుకొన్నాను. సొంతంగా వ్రాయటం నేర్చుకున్నాను.
ఎం.దీపక్‌, 7వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
మొదటి రోజు వచ్చినప్పుడు మాట్లాడటానికి భయం వేసింది. అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఆ భయం కొంచెంగా పోయింది. రేడియో కోసం రికార్డింగు చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది.
ఆర్‌. శివ చరణ్‌, 6వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, నెహ్రూనగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియోలో మేము చాలా నేర్చుకున్నాము. ఈ ప్రోగ్రామ్‌ అరేంజ్‌ చేసిన భార్తి ఫౌండేషన్‌ వారికి, నిర్వహించిన స్కూల్‌ రేడియో వారికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మైక్‌ పట్టుకోవాలంటే భయపడే నేను ఇప్పుడు 'ఎవరు చెప్తారు?' అని అడగగానే ముందుగా నేనే వెళుతున్నాను. నేను ఒక జోక్‌, పాట కూడ రేడియో కోసం రాశాను.
ఎస్‌.భవాని, 9వ తరగతి
కె.ఆర్‌.జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ (బాయ్స్‌), శివానగర్‌, సిరిసిల్లా
**
నేను ఈ 3 రోజుల స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. మొదటి రోజు ప్రశ్నలు అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జవాబు ఇచ్చారు. అలాగే కార్డులు ఇచ్చి, ఆ కార్డులు చూసుకుంటూ, స్టోరీలు రాసిస తర్వాత మళ్ళీ అందరి ముందూ చెప్పడం నాకు చాలా నచ్చింది. రేడియోలో మాట్లాడటానికి ప్రోగ్రామ్‌ ఎలా చేయాలో, ఎంత కష్టం ఉంటుందో ఇలాంటి ప్రోగ్రామ్‌లు చేయటం వలన తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్‌లు చేయటం వలన మనకు నాలెడ్జ్‌, అబ్జర్వింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌, కొత్త కొత్త ఆలోచనలు పెరుగుతాయి. మనలో భయం పోయి ధైర్యంగా ఉంటాం. మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. అలా నమ్మకం ఏర్పడితే మనం ఏదైనా చేయచ్చు. మన లైఫ్‌లో ఏదైనా చెయ్యాలనుకుంటే ముందుగా నమ్మకం ఉండాలి.
కె.అర్చన, 7వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, వెంకంపేట, సిరిసిల్లా
**
మొదటగా నాకు స్కూల్‌ రేడియో అంటే అర్థం కాలేదు. స్కూల్‌ రేడియో అంటే ఏంటి, అసలు అక్కడ ఏం చేస్తారు అని అనిపించింది. మొదటి రోజు చాలా భయం వేసింది. వచ్చి కూర్చున్నాం. తర్వాత అందరి పేరు, తరగతి చెప్పమన్నారు. చెప్పాం. మా స్కూల్‌ వారే కాకుండా ఇంకా ఇతర స్కూల్స్‌ నుండి కూడ వచ్చారు. మొత్తం 50 మంది. తర్వాత ప్రొజెక్టర్‌లో చూపుతూ ప్రశ్నలు అడిగారు. మేము జవాబులు చెప్పాం. కాని మేం చెప్పిన జవాబులు అన్నీ తప్పు. ఆ ప్రశ్నల్లో చాలా లాజిక్స్‌ ఉన్నాయి. ఆ ప్రశ్నల వల్ల నేను ఎలా ఆలోచించాలి అనేది తెలుసుకున్నాను. తర్వాత థీమ్స్‌ గురించి చెప్పి ఒక టాపిక్‌ గురించి రేడియోలో మాట్లాడాలి అని అన్నారు. మేము యూనివర్సల్‌ ఎడ్యుకేషన్‌ టాపిక్‌ ఎంచుకున్నాం. నేను దానికి యాంకరింగ్‌ కూడ చేశాను. ఒక పాట కూడ పాడాను. చాలా బాగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది.
కె.అశ్విత
జెడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, వెంకంపేట, సిరిసిల్లా  

నాకు చాల భయం అనిపించింది. స్కూల్‌ రేడియో టీమ్‌ భయపడొద్దు అని చెప్పినప్పుడు కొద్దిగా భయం పోయింది. 'బీ కాన్ఫిడెంట్‌' అని చెప్పినప్పుడు ధైర్యం పెరిగింది. వారు కొన్ని లాజిక్‌ ప్రశ్నలు అడిగారు. వాటిని ఎక్స్‌ప్లయిన్‌ చేశారు. తరువాత కొన్ని యాక్టివిటీస్‌ చేయించారు. మేము ఎంజాయ్‌ చేశాం. స్కూల్‌ రేడియో ఇంటరెస్టింగ్‌గా ఉంది. కొన్ని కార్డులు ఇచ్చారు. కార్డులలో డిఫరెంట్‌ పిక్చర్స్‌ ఉన్నాయి. ఆ పిక్చర్స్‌ చూసి స్టోరీ రాయమన్నారు. దానివల్ల మాలోని రైటింగ్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌ అయ్యాయి. అలాగే 30 సెకన్ల వీడియో చూపించి, దానిలోనుండి ప్రశ్నలు అడిగారు. మేము గేమ్‌ మీదే దృష్టి పెట్టాం. కానీ వీడియోలో చాలా ఛేంజెస్‌ జరిగాయి. దానివల్ల మాకు అర్థమయింది ఏమిటంటే ప్రతి దాన్ని బాగా అబ్జర్వ్‌ చేయాలని. టోటల్‌గా మేము కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌, లిజనింగ్‌ స్కిల్స్‌, రైటింగ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌ చేసుకున్నాం.
సి.హెచ్‌. దీపిక, 9వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, అంబేద్కర్‌ నగర్‌, సిరిసిల్లా
**
మాలో ఎవరినైనా మాట్లాడమని పిలిచినప్పుడు 'వస్తానని' మా క్లాస్‌ నుంచి నేనొక్కడినే చెప్పాను. స్కూల్‌ రేడియో టీమ్‌ నన్ను మెచ్చుకున్నారు.
నాని, 8వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌కి వచ్చిన తర్వాత మిగిలిన అన్ని స్కూళ్ళ వాళ్ళు దోస్తులు అయ్యారు. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
బి.శశిధర్‌, 6వ తరగతి
జెడ్‌.పి.హెచ్‌. స్కూల్‌, నెహ్రూ నగర్‌, సిరిసిల్లా
**
స్కూల్‌ రేడియో కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో చాలా నేర్చుకున్నాను. స్క్రిప్ట్‌ రైటింగ్‌, న్యూ ఐడియాస్‌, కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, సెల్ఫ్‌లెర్నింగ్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకున్నాను. నాకు ఈ కార్యక్రమం చాలా ఆసక్తిగా ఉంది. ఈ ప్రోగ్రామ్‌కి రావడం వలన నాలోని భయం పోయింది. కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఇక్కడికి రావడం వలన యాకరింగ్‌ ఎలా చేయాలో నేర్చుకున్నాను. స్కూల్‌ రేడియో లాంటి ప్రోగ్రామ్స్‌ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అందువలన ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్‌ కండెక్ట్‌ చేసినందుకు భార్తి ఫౌండేషన్‌, స్కూల్‌ రేడియోలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
యం శ్రావ్య, 8 తరగతి, జైహింద్‌ స్కూల్‌ రేడియో క్లబ్‌ , జడ్‌పిహెచ్‌ఎస్‌, వెంకంపేట్‌, సిర్సిల్లా, రాజన్న సిర్సిల్లా
**
నాకు మొదటిరోజు చాలా నేను ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. బొమ్మలు చూసి కథ రాయడం, రేడియో కోసం ఎలా రాయాలో నేర్చుకున్నాం. మూడోరోజు మైక్‌లో నేను రాసిన విషయం గురించి చాలా బాగా మాట్లాడాను. నాకు బాగా అనిపించింది.
వై. సాయిశ్రీ, 8 తరగతి, జడ్‌పిహెచ్‌ఎస్‌
**
నేను రైటింగ్‌ స్కిల్స్‌, యాక్షన్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌ వంటి అంశాలు నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రాంకి రావడం వలన యాంకరింగ్‌ ఎలా చేయాలో నేర్చుకున్నాను.
ఒ. శ్రీలేఖ, 8 తరగతి, జైహింద్‌ స్కూల్‌ రేడియో క్లబ్‌ , జడ్‌పిహెచ్‌ఎస్‌, వెంకంపేట్‌
**
ఈ మూడు రోజులలో ఆనందంగా నేర్చుకున్నాను. ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
డి. మోనిషా , జైహింద్‌ స్కూల్‌ రేడియో క్లబ్‌ , జడ్‌పిహెచ్‌ఎస్‌, వెంకంపేట్‌
**
నేను ఈ మూడు రోజులు స్కూల్ రేడియో వర్కషాప్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎందుకంటే నేను స్కూల్ రేడియో వర్క్ షాప్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్ రైటింగ్, లిసనింగ్ స్కిల్స్, న్యూ ఐడియాస్, నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, పబ్లిక్ స్పీకింగ్, స్టోరీ రైటింగ్, రేడియో ప్రోగ్రాం ఎలా చేయాలో నేర్చుకున్నాను. నాకు ఈ కార్యక్రమం చాలా ఆసక్తిగా అనిపించింది. అలాగే, నేను యాంకరింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. మాలో ఉన్న కళలను స్కూల్ రేడియో టీమ్ బయటకు తీసింది. ఈ ప్రోగ్రాం మాకెంతో ఉపయోగపడుతుంది. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
సిహెచ్ పూజ, తొమ్మిదవ తరగతి,
జైహింద్ క్లబ్, జడ్పీ హైస్కూల్, వెంకంపేట, సిరిసిల్లా 

School Radio in news

School Radio has published 'Chinnari' Book with the stories written by the students during School Radio Workshop.

Udaya Kumar Gali

Director (Trainings)

School Radio Story Cards

© Copyright 2015 School Radio - All Rights Reserved