స్వ‌చ్ఛ విద్యాల‌య
స్కూల్ రేడియో కార్య‌క్ర‌మం

లాసన్స్‌బే కాలనీలోని కెడిపిఎం ఉన్నత పాఠశాలలో 9 అక్టోబర్‌ 2017న నిర్వహించిన స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో 50 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాలను వేరుచేయటం, చెత్తలో రకాల గురించి విద్యార్థులు బృందాలలో పనిచేస్తూ నేర్చుకొన్నారు. ప్రధానంగా వ్యర్థాల నిర్వహణ అంశాల గురించి స్కూల్‌ రేడియోలో మాట్లాడేందుకు తాము సిద్ధమ‌ని విద్యార్థులు ఉత్సాహంగా అంటున్నారు.

ఇది మా అభిప్రాయం

కెడిపిఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు

స్కూల్‌ రేడియో కార్యక్రమంలో చెత్త వేరు చేయటం నేర్చుకున్నాను. స్నేహితులందరు ఒక్కటై ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా గడిపాము. స్కూల్‌ రేడియో నాకు బాగా నచ్చింది. ఇది ఇంకా కొనసాగించాలని కోరుతున్నాను.

తడి చెత్త, పొడి చెత్త ఆట నాకు చాలా బాగా నచ్చింది. మీలా గురువులు మాకు ఇంకా చాలా మంది వచ్చి, ఇలాంటివి నేర్పించాలి అని కోరుకుంటున్నాను. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాము.

తెలియని విషయాలు తెలియజేశారు. స్నేహితులతో కలిసి యాక్టివిటీలు చేయటం ఆనందంగా వుంది. మళ్ళీ మళ్ళీ చేయాలని వుంది. తడి చెత్త, పొడి చెత్త గురించి తెలుసుకున్నాం.

ఈ రోజు స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో గేమ్స్‌ చాలా బాగా ఆడాను. నాకు తెలియనివి కూడా నేర్చుకున్నాను.

టీమ్‌లలో పనిచేస్తూ రీయూజ్‌, రీసైకిల్‌ గురించి తెలుసుకున్నాము. రేడియోలో మాట్లాడాల‌నే నా కోరిక తీర్చుకోవాలి. సొంతంగా ఒక కథ రాయడానికి ప్రయత్నిస్తాను.

ఈరోజు స్కూల్‌ రేడియోలో నాతో పాటు నా స్నేహితులు అందరూ పాల్గొన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ఆటలు, పాటలతో బాగా ఆడించారు. స్కూల్‌ రేడియో వారికి నా ధన్యవాదాలు.

 కలిసి పనిచేయడం నాకు చాలా నచ్చింది! 

మమ్మల్ని గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూపులో పదిమంది దాకా వున్నారు. ఒక్కొక్క గ్రూపును గుండ్రంగా కూర్చోబెట్టి, మాకు ఒక్కో బాక్స్‌ ఇచ్చారు. అందులో కొన్ని పేపర్ల మీద కొన్ని పేర్లు రాసి ఇచ్చారు. అవి ఇచ్చి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయమన్నారు. తర్వాత రీయూజ్‌ చేయదగినవి, రీసైకిల్‌ చేయదగినవి వేరు చేయమన్నారు. దీని వలన తడి చెత్త, పొడి చెత్త గురించి తెలుసుకున్నాం. ఇలా గ్రూపుగా కలిసి పనిచేయడం నాకు చాలా నచ్చింది. అంతే కాదు మాకు 'చివరి క్షణం' అనే వీడియో కూడ చూపించారు.

ఆర్‌. స్నేహ శ్రీ 

6వ తరగతి

KDPM High School, Vizag

We are very much happy to be involved in School Radio programme. Our children are more enthusiastic to participate in Radio programme. Mrs.Aruna and Mr.Udaya Kumar explained well about Swatchata in and around school as well as homes. They conducted group activities with children regarding cleanliness, dry and wet waste segregation and waste management.  All the 50 children actively participated in the programme and received guidelines from the resource persons about script writing and programme designing.

Naidu, Head Master,

KDPM High School, China Waltair,
Visakhapatnam - 17

  1. పి.రాజసింహ, 8వ తరగతి -స్కూల్‌ రేడియో వల్ల పిల్లలు పిల్లలతో మాట్లాడ‌వచ్చు. అందరి పిల్లల ఆలోచన ఒక్కలా ఉండదు. అందుకే ఒకరితో ఒకరు చర్చించుకుని, గ్రూపులలో ఒకరికి తెలియనివి ఇంకొకరు తప్పకుండా తెలుసుకోవచ్చు. కనుక స్కూల్‌ రేడియో చాలా నచ్చింది. ఇక్కడికి  వచ్చి, మాకు ఇన్ని యాక్టివిటీలు ఇచ్చి, మాలో  ఉన్న ధైర్యాన్ని బయటకు తీసి, మాలో ఉన్న టాలెంట్‌ను మాకు తెలిసేలా చేసారు. ధన్యవాదాలు. 
  2. ఎస్‌.వినయ్‌, 9వ తరగతి - స్కూల్‌ రేడియో నాకు నచ్చింది. ఎందుకంటే చెత్తను ఏవిధంగా వేరు చేయాలో మాకు అర్థమయ్యేలా చెప్పారు. స్క్రీన్‌పై చూపించటంతో మా కళ్లకు అది చాలా స్పష్టంగా కనిపించింది. మాకు ఒక టాస్క్‌ ఇచ్చారు. మేము అందరం ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నాం.
  3. బి. రవణమ్మ, 9 వ తరగతి - స్కూల్‌ రేడియో ప్రోగ్రాం చాలా బాగుంది. రీయూజ్‌ చేయటం ఎలాగో తెలిసింది. అందరితో కలిసి పనిచేయటం వలన మనకు తెలియని వారితో పరిచయం పెరిగింది. స్క్రీన్‌ పై చూపించిన కథ నాకు బాగా నచ్చింది. దీనివలన మనం వాడుకునే వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అని తెలిసింది. 

డిజిటల్‌ స్క్రీన్‌పైన కథ చూపించారు.  గ్రూప్‌లలో ఆటలు ఆడించారు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేయటం, భూమిలో కలిసేవి, కలవనివి వేరుచేయటం, ఇలా రకరకాలుగా వేరు చేయమన్నారు. అది నాకు బాగా నచ్చింది. కొందరిని గ్రూపు లీడర్‌గా పెట్టి, గ్రూపులో ఎవరు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఎవరు డల్‌గా ఉన్నారో చూడమని మరొక గ్రూపు వారికి చెప్పారు. అందరం అందరితో చాలా స్నేహంతో ఉన్నాము. చెత్త రోడ్డు మీద వేయకూడదు, చెత్త కుండీలోనే వెయ్యాలి అని చాలా అర్థమయ్యేట్లు చెప్పారు. ప్రధాని మోదీ గారు కూడా చెత్త బయట వేయకుండా తన జేబులో వేసుకున్నారు. ఇది కూడ వీడియోలో చూపించారు. ఇంకా మనకి రేడియోలో ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, మాట్లాడినప్పుడు ఎలా వుండాలి అని మాకు చెప్పారు. 
- పి.జ్యోతి , 9వ తరగతి

  1. ఆర్‌.ఎస్‌. మాధురి, 6 వ తరగతి - మనం స్వచ్ఛ భారత్‌ చేయాలనీ, ప్లాస్టిక్‌ వస్తువులు వాడకూడదనీ, మన దగ్గర వున్న చెత్తను రోడ్డు మీద పడేయకూడదనీ తెలుసుకున్నాను. మ‌ట్టిలో కలిసేవి ఏవి, కలవనివి ఏవో తెలుసుకున్నాను.
  2. పి. గ్రేసీ, 6 వ తరగతి - నాకు స్కూల్‌ రేడియో ఎంతో నచ్చింది. చెత్తలో రకాల గురించి తెలుసుకున్నాను. లీడర్‌షిప్‌ అంటే కూడా తెలుసుకున్నాను.
  3. ఝాన్సీ, 6 వ తరగతి - స్కూల్‌ రేడియో కార్యక్రమం వలన జీవ వైద్య వ్యర్థాలు, రీయూజ్‌, రీసైకిల్ వంటి ఎన్నో మంచి విషయాలు, విజ్ఞానాన్ని తెలుసుకున్నాము. 

 స్కూల్‌ రేడియోలో మాట్లాడాలని వుంది

నేను ఇపుడు చాలా యాక్టివిటీలు నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో నేర్చుకోవాలని నా అభిప్రాయం. స్కూల్‌ రేడియోలో మాట్లాడాల‌ని నా కోరిక.

నాకు ఇప్పుడు చెప్పింది, చూసింది చాలా అర్థమైంది. చాలావరకు చెత్త గురించి చెప్పారు. చెత్త అంటే ఏమిటో తెలిసింది.

నాకు స్కూల్‌ రేడియోలో మాట్లాడాలని వుంది. ఇప్ప‌టివ‌ర‌కు రేడియోలో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు ఎలాగైనా మాట్లాడ‌తాను.

చెత్త అంటే ఏదీ చెత్త కాదు. తడిచెత్త మ‌ట్టిలో కలిసిపోయి ఎరువు వస్తుంది. అందరం సామూహికంగా కూర్చోని ఆట ఆడాం. కొత్త విషయాలను ఈ ఆట వల్ల తెలుసుకున్నా. అందరి ఆలోచనలు కూడ తెలుసుకున్నాను.

అందరితో కలిసి పనిచేయటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మన దేశంలో కాలుష్యం ఎలా అవుతోందో వీడియోలో చూపించారు. స్కూల్‌ రేడియో ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.

మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతులు తుడుచుకున్న టిష్యూ పేపర్‌ని జేబులో పెట్టుకుంటున్న వీడియో స్కూల్‌ రేడియో కార్యక్రమంలో మేము చూశాము. మేము కూడ స్వచ్ఛ భారత్ పాటిస్తాము.

Poorna Chandra, 8 Standard
School Radio is good for children. It is helping us.

A. Satish, Class 7
In School Radio, Swachh Vidyala programme, we came to know about what is re-cycling and reuse, what mixes in the soil and what does not mix in the soil. We don't want to waste anything. We want to reuse and recycle. We are happy to be part of School Radio. We have learnt many things through games, group discussion and enjoyed to know about friends.

G.Naveen, 8 Standard
In School Radio Programme, I saw that cleanliness is so important in our life. We can reuse and recycle waste material. The difference between bio-degradable, and non bio-degradable items. I like the story 'Chirugula Duppati'. Segregation game is quite interesting and I played with my friends and gained knowledge.

M. Prakash, 8 Standard
I liked this videos, images, and all the game.  I like Teachers (Resource Persons). I like questions from Resource Persons. There was a disturbance (conflict) in the group process and we learnt to clear it. I liked working in groups. I like School Radio programme.

A. Sravani, 8 Standarad
I like School Radio Programme. I like group activity. We have learnt so many things in the programme.

P. Sai Dharani, Class VII
It was really a good activity to all of us and my fear also gone.

Chandi Priya, 7 Standard
There were new opportunities, new learning and our mind was also working sharp.

What the teachers say?

Provide Live Experience to the children. Explain about how radio station is
How to write script for talk in Radio. Swachh Bharat is motivating the children toward clean India is also good. But practical experience is more important.  

School Radio programme is activity based and hence children are very interested to participate. They have learned many new things with ease. They develop effective communication skills. They will lose their fear. This will be a recreation programme. Great idea.

ఈ స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌ చాలా బాగుంది. పిల్లలు పరిశుభ్రత, చెత్తలో రకాల గురించి తెలుసుకునేందుకు గ్రూపులుగా చేసి, విద్యార్థులందరూ పాల్గొనే విధంగా ఎంకరేజ్‌ చేసారు. చిత్రాలు పిల్లలను బాగా ఆకట్టుకునేలా వున్నాయి. కథలు కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రోగ్రామ్‌ సాయంత్రం ప్రారంభమయింది. మార్నింగ్‌ జరిగి ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ కాన్‌సన్‌ట్ర్‌ట్‌ చేసేవారేమో అని అన్పిస్తుంది.

School Radio Programme is very innovative. It is a good platform for children to express their views on various aspects. It improves the listening, speaking, reading, and writing skills (are part of four language skills) of the students. Moreover it draws out the creativity and hidden talents of the children. Children participated actively and enjoyed the activities. They improved the ability to work in group with collaboration.

ఎస్‌. ఉషారాణి, 9 వ తరగతి

స్కూల్‌ రేడియో ప్రోగ్రామ్‌లో మాకు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఈ టాస్క్‌ వలన మేము అందరం గ్రూపులలో చర్చించాము. మాకు తెలియని వాళ్లని కూడ మేము అపుడు పరిచయం చేసుకున్నాము. స్కూల్‌ రేడియో ప్రోగ్రాంలో భాగం
అయినందుకు నాకు చాలా ఆనందంగా వుంది.

ఎం. కావ్య, 9 వ తరగతి

మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈ ప్రోగ్రాంలో టాస్క్‌లు కూడా చాలా నచ్చాయి. మమ్మల్ని గ్రూపులుగా చేసి, తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేయటం ఎలాగో నేర్పారు. మాకు పక్క తరగతి పిల్లలు తెలియదు. మాకు ఈ ప్రోగ్రాం వల్ల ఆ పిల్లలు కూడా తెలిసారు. పరిచయం చేసుకున్నాము. 

కె. లక్ష్మి, 6 వ తరగతి

స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో మాతో ఒక ఆట ఆడించారు. నాకు ఈ ఆట చాలా నచ్చింది. అందులో తడి చెత్త అంటే ఏమి? పొడి చెత్త అంటే ఏమి? ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంతేకాకుండా విజ్ఞానం కూడ పెరిగింది.

హరిత, 7 వ తరగతి

నాకు అన్ని యాక్టివిటీలు నచ్చాయి.  కార్యక్రమం చివరిలో ఒక కథ చూపించారు. దానిలో వస్తువులను రీయూజ్‌ అంటే, తిరిగి ఉపయోగించటం ఎలాగో తెలియజేశారు. నేను కూడ ఇలాంటి కథలు
రాస్తాను. నేను కూడ చెత్తను బండిలో వేసేటప్పుడు, తడిచెత్త, పొడి చెత్త వేరేగా వేస్తాను.

లోకేష్‌, 8 వ తరగతి

స్కూల్‌ రేడియో ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. దీనిలో భయం లేకుండా మాట్లాడేలా చేసారు.  మాతో టైం గడిపి, మంచి కథలు, వీడియోలు చూపించి, వాటి గురించి మమ్మల్ని మళ్ళీ చెప్పమన్నారు, బాగా ప్రోత్సహించారు. మాకు తెలియని వారితో కలిసి ఆటలు ఆడేలా చేసారు. 

పి. రాజేశ్‌,9 వ తరగతి

మనం రోజూ చూస్తూనే వున్నాం. ఎక్కడైనా చెత్త కనపడుతుంది. అందుకని చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలి. రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చుట్టూ చెత్త కనపడుతుంది. అందుకని స్వచ్ఛ భారత్‌ను అందరూ పాటించాలి.

బి. కీర్తి, 6 వ తరగతి

చివరి క్షణం వీడియో చూపించారు. భూమి ఎప్పుడు పుట్టింది? కోతి నుంచి మనిషి పుట్టటం, వ్యవసాయం, పరిశ్రమలు మొదలు కావటం వంటివి తెలిసాయి.

పి. యమున, వై. కావ్య, ఎం.డి. గౌషియా, 6 వ తరగతి

కథలు బాగా నచ్చాయి. పొడి చెత్త ఏదో, తడి చెత్త ఏదో తెలుసుకున్నాను.  చాలా ఆనందం కలిగింది. నాకు స్వచ్ఛ భారత్‌లో పాల్గొనటం చాలా ఇష్టం.

డి. నికిత, 6 వ తరగతి

తడి చెత్త, పొడి చెత్త గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకూడదని చెప్పారు. మాతో బాగా మాట్లాడించారు. ఇది నాకు బాగా నచ్చింది.

© Copyright 2015 School Radio - All Rights Reserved